హర్ట్ ఎటాక్ అనే పదం ఈమద్య తరుచూ వింటున్నాం.. మనదేశంలోనే ప్రతీ 33 సెకన్లకు ఒకరు హార్ట్ ఎటాక్ వల్ల చనిపోతున్నారట. సంవత్సరానికి ఈ గుండె పోటు వల్ల 20లక్షల మంది బలౌతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఈ హార్ట్ ఎటాక్ బారిన పడుతున్న వారిలో 4 నుంచి 10 శాతం మంది 45 ఏళ్లలోపు వయసు వారు ఉండటం ఆలోచించాల్సిన విషయం.. అవగాహన రాహిత్యమే ఈ హార్ట్ ఎటాక్‌కి కారణం. గుండెపోటు లక్షణాలన్నవి తెలుసుకుని, ఆ విధమైన అవగాహనతో ఉండడం ఎంతో అవసరం.
హార్ట్ ఎటాక్ అంటే..
రక్తనాళాలు కుచించుకుపోవడం వల్లనో లేదా రక్త నాళాల్లో కొవ్వు పేరుపోవడం వల్లనో గుండెకు రక్త సరఫరా నిలిచిపోతుంది. రక్త సరఫరా నిలిచిపోవడంతో శరీరంలోని కణాలకు ఆక్సిజన్ అందదు. గుండెపై బారం పడటం వల్ల గుండె పనిచేయడం ఆగిపోతుంది..
1.హార్ట్ ఎటాక్ కు ముందు మనకు కన్పించే లక్షణాలు:. ఎక్కువ మందిలో కనిపించే ప్రథమ లక్షణం చాతి భాగంలో గట్టిగా పట్టేసినట్టు అనిపించడం. చాతిలో నొప్పి, పట్టేసినట్టు, ఒత్తిడి లాంటి లక్షణాలు గుండె పోటుని సూచిస్తాయి. అయితే అందరికీ ఒకేలా ఉండకపోవచ్చు.. ఒక్కొక్కరికీ ఒక్కోరకమైన అనుభవం కనిపించొచ్చు.
2. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనిపించడం.. గాలి పీల్చుకోవడంలో తరచూ ఇబ్బందులు, బాగా దమ్ము వస్తున్నట్టుగా అనిపిస్తే హార్ట్ ఎటాక్‌గా అనుమానించొచ్చు.
3. నొప్పి ప్రథమంగా చాతీలో మొదలై అక్కడి నుంచి ఎడమవైపు చేతిలోకి, భుజంలోకి విస్తరిస్తుంది. హార్ట్ ఎటాక్ బాధితుల్లో ఎక్కువ మందిలో ఇది వస్తుంది.
4.అలసిపోయిన ఫీలింగ్ ఉండటం.. ఊరికే నిలబడి ఉన్నా దమ్ము రావటం.. ఒళ్లంతా నొప్పులుగా ఉండడం వంటి లక్షణాలు తరచూ కనిపిస్తుంటే వాటిని అశ్రద్ధ చేయకూడదు.
5. చెమటలు ఎక్కువగా వస్తున్నా.. చాతీ పట్టేసినట్టు ఉండి చెమటలు పడుతుంటే మాత్రం అది హార్ట్ ఎటాక్ కు సంకేతమే.
6.శరీరం పై భాగం నుంచి ఎడమ చేతి కిందిగా నొప్పి వస్తుంటే దాన్ని హార్ట్ ఎటాక్ లక్షణంగా అనుమానించాలి.
7. దవడల్లో, గొంతులో కూడా నొప్పి అనిపించడం, గొంతు దగ్గర నొక్కినట్టుగా నొప్పి రావడం.
8. బిపీ అసాధారణ రీతిలో ఉండటం కూడా గుండె పోటును సూచిస్తుంది.