జాగ్రత్త కేసీఆర్ సర్… కంగ్రాట్స్ రేవంత్ రెడ్డి!

-

తెలంగాణలో తనదైన ఆధిపత్య ధైర్యంతో దూస్కుపోతున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్! ఈ సమయంలో కరోనా కేసీఆర్ కు తలనొప్పిగా మారింది! ప్రశాంతంగా సాగుతున్నట్లు కనిపించిన పరిపాలనలో పెద్ద అలజడే తీసుకొచ్చింది. స్థబ్ధగా ఉన్న ప్రతిపక్షాల్లో కదలికలు కలిగించింది. ఈ పరిస్థితుల్లో కరోనా తర్వాత కేసీఆర్ ను ఆ స్థాయిలో ఇబ్బంది పెడుతున్న వ్యక్తి రేవంత్ అనే చెప్పాలి. సరిగ్గా రెండున్నర నెలల క్రితం కేసీఆర్ ఒక సంచలన ప్రకటన చేశాడు. హైదరాబాదుకు చుట్టు ఒక్కో ఆస్పత్రిని ఘనంగా నిర్మించుకుందాం. గచ్చిబౌలిలో టిమ్స్ ఆస్పత్రి ఏర్పాటు చేస్తాం అని ఘనంగా ప్రకటించారు. ఏప్రిల్ లో దీన్ని ప్రారంభం కూడా చేశారు.

ఈ సందార్భంగా మాట్లాడుతూ… పది వేల కేసులు వచ్చినా డీల్ చేయగలిగిన స్థితిలో ప్రభుత్వం ఉంది. ఆందోళన అక్కర్లేదు అని కేసీఆర్ ఘనంగా ప్రకటించారు. కట్ చేస్తే… గాంధీలో పేషెంట్లు నిండిపోవడంతో నిమ్స్ ను కోవిడ్ ఆస్పత్రిగా మార్చమని ఆదేశాలు ఇచ్చారు. అయితే… మరి “టిమ్స్” ఏమైందని చాలామందిలో అనుమానం వచ్చింది. ప్రస్తుతం తెలంగణలో కేసీఆర్ పాలనపై ప్రశ్నించే పరిస్థితి కోల్పోయిందన్న విమర్శనెదుర్కొంటున్న మీడియా… దీనిపై స్పందించలేదు!

ఈ క్రమంలో రేవంత్ రెడ్డి టిమ్స్ ను ఆకస్మికంగా సందర్శించారు. “అక్కడ ఎటువంటి ఆస్పత్రి సదుపాయాలు లేవు.. నలుగురు సెక్యూరిటీ మాత్రమే ఉన్నారు.. ఇదీ మన ముఖ్యమంత్రి మాటల గారడీ.. ఆయనలో గొప్పలు చెప్పుకోవడం తప్ప ఏమీ ఉండదు. టిమ్స్ గురించి అంత గొప్పగా చెప్పాడు? చివరకు నిమ్స్ మీద ఆధారపడ్డారు.. అంత ఘనంగా ప్రచారం చేసుకుని మీడియాలో రాయించుకున్నాడు… ఇప్పుడు ఇక్కడ కుక్కలు తిరుగుతున్నాయి. ఈ ఆస్పత్రికి కనీసం డ్రైనేజీ లేదు” అని ఫైరయ్యారు.

అదే కారణమో మరేదైనా కారణమో తెలియదు కానీ… ఉన్నపలంగా (టీమ్స్)లో ఆస్ప‌త్రిలో సిబ్బంది నియామకానికి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఈ మేరకు టిమ్స్ లో 499 మంది వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది సర్కార్. ఇక్కడ సరిగ్గా గమనిస్తే రెండు విషయాలపై అనుమానాలొస్తున్నాయి! రేవంత్ పర్యటించారు, వాస్తవాలు బయటపెట్టారు కాబట్టి… టీమ్స్ ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని ఆస్పత్రిలో సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్ విడలచేసిందా? అని! అలా అయితే… ఈ నోటిఫికేషన్ కచ్చితంగా రేవంత్ విజయమనే చెప్పాలి! అలా కాకుండా… ముందుగానే సర్కార్ ఈ ప్లాన్ చేసుకుంది అంటే… ఆ విషయం రేవంత్ కి ముందే లీకై “టీమ్స్ విజిట్” కి వెళ్లయినా ఉండాలి అని! దీంతో… ఏ రకంగా చూసుకున్నా… ఇది రేవంత్ సక్సెస్ అనే మాటలు వినిపిస్తున్నాయి.

కేసీఆర్… రేవంత్ మాటలు వింటున్నారా? లేక కేసీఆర్ టీం లో రేవంత్ కోవర్టులు ఉన్నారా? (దానికి ఈటెల విషయాన్ని ఉదాహరణగా చూపిస్తున్నారు) వీటిలో ఏదో ఒకటి అయితే నిజమయ్యి తీరాలని పలువురు అభిప్రాయపడుతున్నారు!! ఈ క్రమంలో ఆన్ లైన్ వేదికగా రెండే రెండు మాటలు వినిపిస్తున్నాయి… “కోవర్టులున్నారేమో జాగ్రత్త కేసీఆర్ సర్… ఎనీ వే కంగ్రాట్స్ రేవంత్ రెడ్డి” అని!

Read more RELATED
Recommended to you

Latest news