యాప్ లో లోన్ తీసుకుంటున్నారా.. జర జాగ్రత్త..!

ఒకప్పుడు పర్సనల్ లోన్ తీసుకోవాలి అంటే ఎంతో ప్రాసెస్ ఉండేది. కానీ ప్రస్తుతం కేవలం నిమిషాల వ్యవధిలోనే పర్సనల్ లోన్ తీసుకునేందుకు అవకాశం ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా నేటి రోజుల్లో ఎంతోమంది నెటిజన్లకు పర్సనల్ అందించేందుకు ఎన్నో రకాల యాప్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. చిన్న చిన్న మొత్తాలలో లోన్ అందిస్తూ ఆ తరువాత ఏకంగా పెద్ద మొత్తాలను అందించేందుకు కూడా సిద్ధం అవుతున్నాయి ఎన్నో యాప్స్. ప్రస్తుతం ఎంతో మంది చిన్న చిన్న యాప్స్ ఉపయోగించుకుని పర్సనల్ లోన్స్ పొందుతున్న వారు కూడా ఉన్నారు.

అయితే ఈ పర్సనల్ లోన్స్ ద్వారా ఇబ్బందులు ఎదురవు తున్నట్లు తెలుస్తుంది. సాధారణంగా ఒక నెల పరిమితికి పర్సనల్ లోన్ తీసుకున్న తర్వాత కేవలం రెండు మూడు రోజుల వ్యవధిలోనే తీసుకున్న మొత్తాన్ని మళ్ళీ చెల్లించాలని ఒత్తిడి తీసుకురావడం… తీసుకున్న వారితో పాటు అప్లికేషన్లు పొందుపరిచిన ఇతరుల నెంబర్లకు ఫోన్ చేసి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అంటూ బెదిరింపులకు పాల్పడటం చేస్తున్నట్లు ప్రస్తుతం టాక్ వినిపిస్తోంది. అందుకే చిన్న చిన్న మొత్తాలను ఇచ్చే యాప్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి సూచిస్తున్నారు నిపుణులు.