బాబు గారికి భయం పట్టుకుంది.. అందుకే అలా చేస్తున్నారు..!

సాధారణంగానే ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పట్ల అమితమైన అభిమానాన్ని గౌరవాన్ని చూపించే మంత్రి కొడాలి నాని ప్రతిపక్షాలు జగన్ సర్కార్ పై విమర్శలు చేస్తే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటే… టిడిపి ఆటంకం సృష్టిస్తుంది అని గత కొన్ని రోజులుగా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై స్పందించిన మంత్రి కొడాలి నాని టీడీపీ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

kodali nani

పేద ప్రజలకు ప్రభుత్వం ఇస్తామన్న ఇల్లు ఇవ్వకుండా అడ్డుకోవడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. దీని కోసం ఏకంగా 25 కోట్ల వరకు ఖర్చు పెట్టారు అంటూ విమర్శించారు. పేదలకు ఇచ్చిన ఇల్లు రిజిస్ట్రేషన్ కాకుండా చూడటానికి హైకోర్టు సుప్రీంకోర్టు లకి వెళ్లి ప్రస్తుతం నాటకాలు ఆడుతున్నారు అంటూ విమర్శించారు. ఒకవేళ ప్రభుత్వం పేదలకు ఇల్లు ఇస్తే చంద్రబాబుకు రాష్ట్రంలో రాజకీయ భవిష్యత్తు ఉండదని భావించి ఇలా చేస్తున్నారని చంద్రబాబు ఎన్ని అడ్డంకులు సృష్టించినా పేదలకు ఇళ్లు ఇచ్చి తీరుతాం అని స్పష్టం చేశారు.