ఒకసారి మనల్ని చిన్న విషయం చాలా బాగా బాధిస్తుంటుంది. దాని నుండి బయట పడడానికి కూడా మనకు చాలా కష్టం అయిపోతుంది. ఎంత హ్యాపీగా ఉందాం అన్నా పదే పదే జరిగిపోయిన విషయం కోసం తలచుకుని బాధపడుతూ ఉంటాం. అయితే మెంటల్లీ హ్యాపీగా ఉండాలంటే తప్పకుండా వీటిని అనుసరించండి.
బాధ పడకండి ఆనందంగా ఉండండి:
అంత సులభంగా ఆనందం అనేది రాదు. ఎప్పుడూ కూడా మీరు మీలో మీరు కుమిలి పోకండి. ఆనందంగా ఉండడానికి మాత్రమే ప్రయత్నం చేయండి. అలానే మీకు ఆనందం ఎందులో దొరుకుతుందో ఆ పనులు మాత్రమే చేయండి. దీంతో మీరు మీకు బాధ కలిగించే వాటి నుంచి దూరంగా ఉండవచ్చు.
నెగిటివ్ ఆలోచనలు మానుకోవడం:
ఎవరైనా ఏమైనా మాట్లాడుతుంటే మీ కోసం మాట్లాడుతున్నారు అనే భావన లాంటివి తీసేయండి. ఇలా వచ్చే ఎన్నో నెగటివ్ ఆలోచనలని మీరు కనుక కట్ చేసి పాజిటివ్ గా ఆలోచించడం మొదలు పెడితే మీకు ఆనందమే మిగులుతుంది.
డబ్బులతో హ్యాపీనెస్ రాదు అని గుర్తుపెట్టుకోండి:
చాలా మంది డబ్బు వల్ల హ్యాపీనెస్ వస్తుంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు అని ప్రతి ఒక్కరు భావించి… అలా అనుసరిస్తే తప్పకుండా మీరు హ్యాపీగా ఉండగలరు.
ఇతరులని క్షమించండి:
ఎప్పుడైనా ఏదైనా ఎవరైనా బాధ కలిగిస్తే వాళ్ళని క్షమించండి. వీలైనంతవరకు ఇతరులతో తగాదా పెట్టుకోకుండా కాంప్రమైస్ అయిపోండి. దీనితో మీరు ఆనందంగా ఉండగలరు.