మాతృమూర్తి కావాలి
ఏ స్త్రీ అయినా కోరుకునేది ఇదే
మల్లె తీగ వంటిది మగువ జీవితం అని అంటారు కదా!
అందులో చక్కని పిల్లలు చక్కని సంసారం రెండూ ఇమిడిపోతేనే స్త్రీ వైవాహిక జీవితానికి పరిపూర్ణత అన్నది లభిస్తుంది.అందాల తారా తీరంలో అంతులేని విషాదాలు..కారణానికి అందని పరిణామాలు విధి రాత పేరిట చెలామణీ అవుతుంటాయి.ఆ కోవలో ఆ తోవలో ఇప్పుడో జంట. వెరీ ఫేమస్ అండ్ ఫెమిలియర్ పెయిర్ .. వారే అక్కినేని నాగచైతన్య – సమంత రూత్ ప్రభు. వారి వ్యక్తిగత జీవితాలకు సంబంధించి ఇప్పుడూ ఎప్పుడూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది.ఆ కోవలో ఆ తోవలో ఇవాళ్టి బ్యూటీ స్పీక్స్..
మీ కోసం..
అక్కినేని నట వారసుడు నాగ చైతన్యను ఏం మాయ చేశావే అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఆమె ప్రేమాయణం వైపు చూశారు. ఆ ప్రేమ సఫలీకృతం అయి పెళ్లి పీటల దాకా వెళ్లేసరికి సంబరపడిపోయారు. పెళ్లి వేడుకలు అటు హిందూ సంప్రదాయం అనుసారం అదేవిధంగా క్రీస్టియన్ సంప్రదాయం అనుసరించి (డెస్టినీ వెడ్డింగ్) చేసుకోవడంతో అసలు ఆ వేళ అక్కినేని కుటుంబానికే కాదు ఆయనను తమ సొంత మనుషులుగా చూసుకునే వారందరికీ పండగ లాంటి రోజు. అదేవిధంగా సమంత కూడా తన ఆనందాలకు అవధులే లేవని చెప్పింది. ఆ మాటలకు అనుగుణంగానే ఆ ఇంటి కోడలుగా అమలతో నాగ్ తో కలిసి పోయింది కూడా!
కానీ చేతి రేఖలు, నుదిటి రాతలు అనుసారం జాతకాలు మారిపోతాయి అని అంటారు కదా! ఆ విధంగా ఆమె అనూహ్య రీతిలో నాగ చైతన్య కు విడాకులు ఇచ్చేస్తానని అన్నారు. సోషల్ మీడియా పోస్టు చేసి సంచలనం రేపారు. ఆ తరువాత తన కెరియర్ ని దిద్దుకుంటూ, నట జీవితం ఇంకాస్త వేగం పెరిగేలా చేశారు. వరుస సినిమాలతో వరుస ఆన్లైన్ ప్రాజెక్టులతో ఓయబ్బో! అనుకునేంతగా ఆమె బిజీ అయిపోయారు. నాగ చైతన్య కూడా ఇదే సమయంలో తన వరకూ విడాకులకు సంబంధించి ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. అక్కినేని కుటుంబం మొత్తం ఎంతో హుందాగానే ఇవాళ్టికీ ఉంది.
అమల కూడా తన నిర్ణయాన్ని గౌరవిస్తున్నామనే చెబుతూ, ఇది దురదృష్టకర ఘటన అని మాత్రమే చెప్పారు. నాగ్ అయితే ఇప్పటికీ ఎక్కడా వారిద్దరి విషయమై మాట్లాడేంందుకు ఆసక్తి చూపడం లేదు. ఏదేమయినప్పటికీ ఇవాళ సమంత మళ్లీ వార్తల్లో నిలుస్తున్నారు. సినిమాల పరంగానే కాదు ఆమె గతంలో ప్రెగ్నెన్సీకి సంబంధించి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. అవే ఇప్పుడు మళ్లీ రీ ట్రెండ్ అవుతున్నాయి. ట్రోల్ అవుతున్నాయి. ఓ విధంగా సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్టింగ్ పాయింట్ అవుతున్నాయి. అన్నీ బాగుంటే ఆమె ఈ ఏడాది ఆగస్టుకు పండంటి బిడ్డకు జన్మనిచ్చేదే! ఎందుకంటే ఈ మాట ఆమె గతంలో ట్వీటర్ వేదికలోనే వెల్లడించారు. ఆస్క్ మి ఎనీథింగ్ పేరిట నిర్వహించిన ఓ సెషన్ లో సమంతనే వెల్లడించారు. ప్చ్! బ్యాడ్ లక్ ..