రవితేజ హీరోగా నటించిన ఖిలాడీ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలు వైభవోపేతంగా జరిగాయి.హైద్రాబాద్లో జరిగిన వేడుకలకు డైరెక్టర్ బాబీ అతిథిగా విచ్చేశారు.
వేడుకల్లో అందాల తారలు డింపుల్ హయతి, మీనాక్షీ చౌదరి సందడి చేశారు.దేవీ శ్రీ సంగీతం ఎంతగానో ఆకట్టుకుంటోందని,కిల్ కిల్ ఖిలాడీ సాంగ్ తనకు ఆల్ టైం ఫేవరెట్ అని రవితేజ చెప్పారు.
ఇదే సందర్భంలో సినిమాకు పనిచేసిన సాంకేతిక నిపుణులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
మెగా డైరెక్టర్ బాబీని మైక్ టైసన్ అంటూ పొగిడారు.మాటలు రాసిన శ్రీకాంత్ విస్సా ను అదేవిధంగా దర్శక,నిర్మాత రమేశ్ వర్మను, నిర్మాత కోనేరు సత్యనారాయణ అభినందించారు.జై సినిమా అంటూ రవితేజ తన ప్రసంగాన్ని ముగించి..అభిమానులను ఉర్రూతలూగించారు.
– మన లోకం ప్రత్యేకం