నాగచైతన్య “కస్టడీ” నుంచి బేబమ్మ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

-

వెంకట్ ప్రభు దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం కస్టడీ. ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం తమిళ, తెలుగు భాషలలో తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. టైటిల్ పోస్టర్ నుంచి ఈ సినిమా ఆసక్తిని రేకెత్తిస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో మే 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ వీడియో సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. తాజాగా ఈ చిత్రంలో ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తున్న కృతి శెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్ ని మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్ లో సాలిడ్ ఎమోషన్స్ కనబరిచేలా కృతి శెట్టి కనిపిస్తుంది. ఈ సినిమాలో బేబమ్మ రేవతి పాత్రను పోషించిందనే విషయాన్ని రివీల్ చేశారు.

అలాగే ఇళయరాజా సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో శరత్ కుమార్ ఓ కీలకమైన పాత్రను పోషించారు. అరవింద్ స్వామి విలన్ పాత్రలో నటిస్తుండగా.. ప్రియమణి ఓ పవర్ఫుల్ పాత్రలో కనిపించనుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news