ఆ వ్యక్తికి జంతువుల వలె కొమ్ములు మొలిచాయి.. షాకింగ్..!

మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాకు చెందిన శ్యాంలాల్ యాదవ్‌కు గత కొన్నేళ్ల కిందట గాయం కారణంగా కొంత కాలం నుంచి తలలో కొమ్ము మొలవడం ప్రారంభమైంది.

వాడికి బాగా కొమ్ములు మొలిచాయి రా.. పొగరు పెరిగింది..అనే మాటలు మనం పలు సందర్భాల్లో వింటూనే ఉంటాం. ఎవరికైనా బాగా గర్వం బాగా పెరిగితే ఆ పదాలను వాడుతుంటారు. కానీ నిజానికి మనుషులకు ఎవరికీ అసలు కొమ్ములు మొలవవు. కేవలం జంతువులకే మాత్రమే కొమ్ములు వస్తాయి. అయితే ఓ వింత వ్యాధితో బాధపడుతున్న ఆ వ్యక్తికి నిజంగానే కొమ్ములు మొలిచాయి. అవును.. ఇది నిజమే..!

because of rare disease horn growing in this mans head

మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాకు చెందిన శ్యాంలాల్ యాదవ్‌కు గత కొన్నేళ్ల కిందట గాయం కారణంగా కొంత కాలం నుంచి తలలో కొమ్ము మొలవడం ప్రారంభమైంది. మొదట్లో అతను దాన్ని సొంతంగా కట్ చేసేవాడు. అయినప్పటికీ అది మళ్లీ మొలవడంతోపాటు ఆ ప్రాంతంలో నొప్పిగా ఉండేది. దీంతో అతను ఇటీవలే హాస్పిటల్‌లో చేరి ఆ కొమ్మును సర్జరీ ద్వారా తీసేయించుకున్నాడు.

కాగా కొన్ని కేవలం కొన్ని అరుదైన సందర్భాల్లో మాత్రమే ఇలా మనుషులకు కొమ్ములు పెరగడం జరుగుతుందని అతనికి సర్జరీ చేసిన వైద్యులు చెబుతున్నారు. ఈ విషయంపై సైంటిస్టులు ప్రస్తుతం ప్రయోగాలు చేస్తున్నారని వారు తెలిపారు. ఏది ఏమైనా ఈ విషయం మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.