అలా కావడం వల్లే.. చాలా కోల్పోయానంటున్న ప్రముఖ హీరోయిన్..!!

-

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలనాటి నటీమణులు ఎంతో మంది ఉన్నప్పటికీ నటి సితారకు ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది. ఈమె మొదటిసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి 1990వ సంవత్సరంలో వచ్చిన మనసు మమత అనే చిత్రం ద్వారా తొలిసారిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది సితార. అటు తరువాత శ్రీవారి చిందులు,మహాలక్ష్మి, జీవన చదరంగం వంటి చిత్రాలలో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నది సితార.

ఈమె తెలుగులోనే కాకుండా మలయాళం, కన్నడ, తమిళం వంటి భాషలలో కూడా నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ గుర్తింపు తోనే ప్రస్తుతం ఇప్పటికీ కూడా కొన్ని సినిమాలలో నటిగా నటిస్తూనే ఉన్నది. ఇక అంతే కాకుండా కొన్ని సీరియల్స్ లో కూడా నటిస్తూ ప్రేక్షకులను బాగా అలరిస్తుంది సితార. సితార తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని అందులో తన జీవితంలో జరిగిన కొన్ని విషయాలను తెలియజేసింది.

సితార మాట్లాడుతూ తన చిన్న వయసులోనే హీరోయిన్ కావడంతో తన టీనేజ్ లైఫ్ ని చాలా మిస్ అయిపోయాను. కాలేజ్ కి వెళ్ళినప్పుడు తన ఆలోచనలు అన్నీ కూడా సినిమాలతో నిండిపోయి ఉండేవని తెలియజేసింది సితార. ఇక అలా సినిమాలతో తన జీవితాన్ని గడుపుతున్న సమయంలోనే తన తండ్రి మరణించడంతో.. తన తల్లి చెప్పిన చిన్న చిన్న పనులు చేస్తూ ఉండాల్సి వచ్చిందని ఎంతో బాధపడింది సితార.

ఇక ఈమె ప్రస్తుతం 40 సంవత్సరాల వయసు ఉన్నప్పటికీ కూడా ఇంకా వివాహం చేసుకోలేదు. అయితే ఈ విషయంపై సితారా ని అడగగా ఈ విషయం ఎక్కడికి వెళ్ళినా అందరూ ప్రశ్నిస్తూనే ఉంటారని తెలియజేసింది. ప్రస్తుతం ఈమె ఇంటింటి గృహలక్ష్మి అనే సీరియల్లో నటిస్తున్నది.

Read more RELATED
Recommended to you

Exit mobile version