సరాసరి లిరికల్ సాంగ్ వచ్చేసింది…!

-

నితిన్ హీరోగా వెంకయ్ కుడుముల దర్శకత్వంలో వస్తున్న చిత్రం భీష్మ. సూర్యదేవర నాగ వంశీ నిర్మాతగా వస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఒక లిరికల్ సాంగ్ ని చిత్ర యూనిట్ కాసేపటి క్రితం విడుదల చేసింది. సరా సరి అనే ఈ సాంగ్ ని కాసేపటి క్రితం విడుదల చేసారు. నా కలలే నీ రూపంలో ఎదురయ్యే నిజమా మాయ అంటూ స్టార్ట్ అయిన ఈ సాంగ్ విశేషంగా ఆకట్టుకుంది.

ఈ సాంగ్ లో నితిన్, హీరోయిన్ రష్మిక మంధన వెంటపడుతూ, తన ప్రేమను వ్యక్తపరుస్తూ ఉన్నట్టు ఉంటుంది ఈ సాంగ్. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విశేషంగా ఆకట్టుకుంది. కొన్ని విజువల్స్ ని కూడా జోడించారు. పొలాల్లో ఉండే కొన్ని సీన్లు ఆకట్టుకున్నాయి. ఇక రాష్మిక కూడా ఈ సాంగ్ లో అందంగా కనపడింది. అదే విధంగా షూటింగ్ సమయంలో కొన్ని విజువల్స్ ని కూడా జోడించారు.

సాంగ్ కి లిరిక్స్, మ్యూజిక్ హైలెట్ గా నిలిచింది. రష్మిక మంధనా సాంప్రదాయంగా ఆకట్టుకుంది. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకి రానుంది. శ్రీనివాస కళ్యాణ౦ తర్వాత నితిన్ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా కోసం అతని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఫ్యామిలీ హీరోగా కూడా ముద్ర వేసుకున్న నితిన్ ఈ సినిమాతో వాళ్లకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news