ఐపీఎల్ మొదలు కాకముందే.. ఢిల్లీ క్యాపిటల్స్‌లో ఒక వికెట్ ఔట్..!

-

ఐపీఎల్ 2020 సీజన్ మొదటి నుంచి అనేక మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు వస్తుంది. ఇప్పటికీ క్రీడాకారులు అందరూ యూఏఈ వెళ్లారు. ఆట మొదలు కాక ముందు ఢిల్లీ టీమ్ కు పెద్ద సమస్య మొదలు అయింది. ఆ జట్టు ఓపెనర్ జేసన్ రాయ్ గాయం కారణంగా ఐపీఎల్ 2020 సీజన్‌కి దూరంగా ఉండాలని నిన్న నిర్ణయించుకున్నాడు.పాకిస్థాన్‌తో శుక్రవారం నుంచి జరగనున్న మూడు టీ20 సిరీస్‌ కోసం సిద్ధమయ్యే క్రమంలో ఈ ఇంగ్లాండ్ ఓపెనర్ గాయపడ్డాడు.జేసన్ రాయ్ పక్కటెముకలకి తీవ్రమైన గాయం కావడంతో ఐపీఎల్ 2020 సీజన్‌కి అతను దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.

ఐపీఎల్‌ కోసం యూఏఈ వెళ్లిన జట్లు ముంబయి ఇండియన్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ అసంతృప్తితో ఉన్నాయి. అదనంగా మరో వారం రోజులు క్వారంటైన్‌లో ఉండాల్సి రావడమే అందుకు కారణం. ఈ రెండు అబుదాబి కేంద్రంగా ఉంటూ టోర్నీలో ఆడనున్నాయి. అయితే అక్కడి నిబంధనల ప్రకారం ఎవరైనా బయటకెళ్లాలంటే 14 రోజులు క్వారంటైన్‌లో ఉండడం తప్పనిసరి. అదే దుబాయ్‌ కేంద్రంగా ఉండే ఆరు ఐపీఎల్‌ జట్లకు మాత్రం క్వారంటైన్‌ ఏడు రోజులే. కోల్‌కతా జట్టు ఆగస్టు 20న, ముంబయి 21న యూఏఈ చేరుకున్నాయి. అదే సమయంలో దుబాయ్‌ చేరుకున్న ఆరు జట్లలో కొన్ని ప్రాక్టీస్‌ మొదలెట్టాయి. కానీ ముంబయి, కోల్‌కతా ఆటగాళ్లు మరో వారం రోజులు హోటళ్లలోనే ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version