హైదరాబాద్ నాంపల్లి పరిధిలో జంట హత్యల కలకలం రేపింది. రోడ్డుపై బిక్షటన చేసే వారిని గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు. మొదట హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓవ్యక్తి తలపై రాయితో మోది నిందితులు హత్య చేశారు. నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న వ్యక్తిని కూడా దుండగులు రాయితో కొట్టి చంపారు.
రెండు సంఘటనలకు సంబంధించి హతమార్చిన వ్యక్తి ఒక్కడే అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బిక్షాటన చేస్తున్న వారిని హత్య చేయడం వెనక ఉన్న కారణం ఎంటా అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇద్దరినీ డబ్బుల కోసం హత్య చేశారా లేదంటే మరేవైనా కారణాలు ఉన్నాయా అని పోలీసులు అనుమానిస్తున్నారు.