ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అధినేత అఖిలేష్ యాదవ్ సంచలన ప్రకటన చేశారు. ఉత్తరప్రదేశ్ 2022 అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని సోమవారం ప్రకటించారు. తాను కేవలం పార్టీ తరుపు ప్రచారం మాత్రమే చేస్తానని ప్రకటించాడు. రాష్ట్రీయ లోక్ దల్ పార్టీతోొ త్వరలోనే పొత్తు ఖరారు అవుతుందని అఖిలేష్ తెలిపారు. తాజాగా అఖిలేష్ నిర్ణయం రాజకీయ పార్టీలను విస్మయానికి గురిచేంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో యూపీ ఎన్నికలు జరగునున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీలు తమ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నారు.
మరోవైపు అఖిలేష్ యాదవ్ జిన్నాను సర్ధార్ వల్లబాయ్ పటేల్ లో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. గతంలో ఎస్పీ ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలకు పేర్లు మార్చడం తప్పిలే బీజేపీ ఏం చేయలేదని అఖిలేష్ విమర్శిస్తున్నారు. అయితే ఈ విమర్శలపై బీజేపీ గట్టిగానే స్పందించింది. జిన్నాను సర్దార్ వల్లబాయ్ పటేల్ తో పోల్చడాన్ని తీవ్రంగా అభ్యంతరం తెలియజేస్తోంది. ఈ వ్యాఖ్యలు సమాజ్ వాదీ పార్టీ తాలిబన్ మనస్తత్వాన్ని తెలియజేస్తుందని విమర్శింది బీజేపీ.