బెల్లంకొండ ఏంటిలా షాకిచ్చాడు!

-

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఉన్న‌ట్టుండి షాకిచ్చాడు. ఉన్న ప‌ళంగా కొత్త లుక్‌లోకి ట్రాన్స్‌ఫార్మ్ అయిపోయి రెట్రో లుక్‌లో అంతా అవాక్క‌య్యేలా చేశాడు. 80వ ద‌శ‌కం లుక్‌లో బెల్లంకొండ శ్రీ‌నివాస్ క‌నిపిస్తున్న ఓ పిక్ వైర‌ల్‌గా మారింది. బెల్లంకొండ శ్రీ‌నివాస్ న‌టిస్తున్న తాజా చిత్రం `అల్లుడు అదుర్స్‌`. ఫా్య‌మిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా సంతోష్ శ్రీ‌నివాస్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్‌. న‌భా న‌టేష్ హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు.

ఈ మూవీ షూటింగ్ ఇటీవ‌లే రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభ‌మైంది. కీల‌క స‌న్నివేశాల్ని చిత్రీక‌రిస్తున్నారు. ప్ర‌కాష్‌రాజ్‌, సోనుసుద్ ల‌తో పాటు హీరో బెల్లంకొండ శ్రీ‌నివాస్ పాల్గొన‌గా కీల‌క ఘ‌ట్టాల్ని షూట్ చేస్తున్నారు. ఈ స‌న్నివేశాల్లో బెల్లంకొండ శ్రీ‌నివాస్ రెట్రోలుక్‌లో క‌నిపిస్తార‌ట‌. `అల్లుడు శీను` త‌ర‌హాలో బెల్లంకొండ శ్రీ‌నివాస్ పాత్ర హిలేరియ‌స్‌గా వుంటుంద‌ని తెలిసింది. త్వ‌ర‌లో టీజ‌ర్‌ని రిలీజ్ చేసి చిత్రాన్ని సంక్రాంతి బ‌రిలో దించాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news