ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ అల్లకల్లోలం చేస్తుంది. ఈ మహమ్మారి కారణంగా చాల మంది ప్రాణాలను కోల్పోయారు. అంతేకాకుండా విదేశాలకు వెళ్లిన భారతీయులు అక్కడే చిక్కుకొని పోయారు. వారిని స్వదేశానికి తిరిగి తీసుకరావడానికి కేంద్ర ప్రభుత్వం వందే భారత్ మిషన్’ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ మిషన్ మే 6న ప్రారంభమైంది.
ఈ మిషన్ ఇప్పటివరకు నాలుగు దశలు పూర్తి చేసుకున్నది. అంతేకాకుండా ఆగస్టు 1 నుంచి ఐదో దశ మొదలైంది. కాగా, ఈ మిషన్ ద్వారా ఇప్పటివరకు 10 లక్షల 59వేల మంది ప్రవాసులు లబ్ధి పొందారని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. 9 లక్షల 39వేల మందిని వివిధ దేశాల నుంచి స్వదేశానికి తరలిస్తే… లక్ష 20 వేల మంది భారత్ నుంచి విదేశాలకు వెళ్లారని తెలియజేశారు. బుధవారం కూడా విదేశాల నుంచి 3,841 మంది ఇండియాకు వచ్చారని ఆయన చెప్పారు. ‘వందే భారత్ మిషన్’ ఐదో దశలో మరింత మంది ప్రవాసులను స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పూరి తెలియజేశారు.