కేసీఆర్ పాలనపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి విమర్శల చేశారు. రాష్ట్రంలో కరోనా కేసులు విజృంభిస్తున్న సంగతి అందరికి తేలిందే. అయితే తెలంగాణ కేబినెట్ నిర్ణయాలపై జగ్గారెడ్డి పలు ఆరోపణలు చేశారు. కేబినెట్‌లో కరోనా కంటే సెక్రటేరియట్ నిర్మాణం గురించే చర్చ జరిగిందన్నారు. సెక్రటేరియట్ నిర్మాణంలో ఎన్ని అంతస్తులు కట్టాలి, డైనింగ్ ఎక్కడ పెట్టాలి అని కేబినెట్‌లో చర్చిస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో కరోనా మహమ్మారి కారణంగా చాల మంది ప్రాణాలను కోల్పోతున్నారు. కరోనా బారి నుండి ప్రజలను రక్షించాల్సింది పోయి.. సెక్రటేరియట్ నిర్మించడం న్యాయమేనా అంటూ ప్రశ్నించారు. సెక్రటేరియట్‌కి 500 కోట్లు అవసరమా..? కరోనాకేమో 100 కోట్లు… సచివాలయానికేమో 500 కోట్లా..? మానవత్వం లేని ప్రభుత్వం ఇదంటూ దుయ్యబట్టారు. సెక్రటేరియట్ మీద చూపించిన శ్రద్ధ.. ఆస్పత్రుల మీద దృష్టి సారిస్తే మంచిదని, మంత్రి కాబట్టి గాంధీ ఆస్పత్రిల చుట్టూ 50 మంది వైద్యులు ఉంటారు కానీ సామాన్యుడికి కూడా అలాంటి వైద్యమే చేస్తారా..? మంత్రులు భజన మానుకోండి. కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్చాలి. త్వరలోనే దీనికోసం దీక్ష చేస్తా.. దీక్ష చేసి వదిలేయను.’ అంటూ జగ్గారెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.