ముఖానికి ఆయిల్ రాస్తే కలిగే లాభాలివే..!

-

చాలా మంది ముఖానికి నూనెను అప్లై చేసుకుంటూ ఉంటారు. అయితే నిజంగా దాని వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనేది చాలా మందికి అవగాహన లేదు. నిజంగా ముఖానికి కొన్ని రకాల నూనెలని రాయడం వల్ల ముఖం కేవలం అందంగా మాత్రమే కాకుండా మరెన్నో ప్రయోజనాలు ఉంటాయి. యువి కిరణాల నుండి ప్రొటెక్ట్ చేయడానికి, పొల్యూషన్ నుండి రక్షించడానికి బాగా ఉపయోగపడతాయి.

 

నూనెల్లో ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి. లేనోలినిక్ యాసిడ్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి మరియు విటమిన్ ఇ వాటిల్లో ఉంటాయి. టీ ట్రీ ఆయిల్, గ్రేప్ సీడ్ ఆయిల్, అవకాడో ఆయిల్, రోజ్ హిప్ ఆయిల్ వంటివి ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ నూనెలని ఉపయోగించడం వల్ల చర్మం హైడ్రేట్ గా ఉంటుంది. అదే విధంగా యాకానీ వంటి సమస్యలు కూడా తొలగిస్తుంది.

ముఖంపై ముడతలు పడకుండా స్పాట్స్ వంటివి రాకుండా చూసుకుంటుంది. అలానే స్కిన్ కాంప్లెక్షన్ కూడా బాగుంటుంది. సెన్సిటివ్ స్కిన్ వాళ్లకి కూడా చాలా ప్రయోజనం కలుగుతుంది. చర్మంపై రాషెస్ వంటివి రాకుండా చూసుకుంటుంది. ఇలా ముఖానికి ఆయిల్ రాసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు మనం పొందొచ్చు.

ఎలా అప్లై చేసుకోవాలి…?

ముందుగా మీ ఫేస్ కి సీరం రాసి ఆ తర్వాత ఆయిల్ రాయండి. ఇది రాస్తే ఫలితం ఉంటుంది. ఒకసారి చర్మం నూనెను పీల్చుకున్నాక దాని మీద మాయిశ్చరైజర్ రాయండి. నెక్స్ట్ దాని మీద సన్ స్క్రీన్ లోషన్ కూడా రాసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news