ESIC స్కీమ్‌లో మీరు వున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఇప్పుడు అటల్ బిమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన పథకం గడువును పొడిగించింది ఈఎస్ఐసీ. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. కరోనా వైరస్ మహమ్మారి తరవాత సంక్షోభంలో ఉద్యోగాలు కోల్పోయిన వారిని కేంద్ర ప్రభుత్వం అటల్ బిమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన పథకం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
అయితే ఈ స్కీమ్ గడువు 2020 డిసెంబర్ 31న ముగిసింది. దీంతో ఆ తర్వాత ఈ స్కీమ్ గడువును 2021 జూన్ 30 వరకు పొడిగించింది. అయితే ఈసారి ఏకంగా ఒక ఏడాది గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2021 జూలై 1 నుంచి 2022 జూన్ 30 వరకు ఈ స్కీమ్‌ను ఎక్స్టెండ్ చేసారు.
ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ (ESIC) సబ్‌స్క్రైబర్లు ఉద్యోగం కోల్పోతే ఈ సంస్థ ద్వారా ఆర్థిక సాయం పొందొచ్చు. అయితే 90 రోజుల వేతనంలో 25 శాతం వేతనం పొందేలా ఈ స్కీమ్ రూపొందించారు. కరోనా వైరస్ సంక్షోభం సమయంలో ఈ బెనిఫిట్‌ను 50 శాతానికి పెంచారు. ఇది ఇలా ఉంటే 90 రోజుల తర్వాత క్లెయిమ్ ని 30 రోజులకు తగ్గించింది. అంటే ఉద్యోగం కోల్పోయిన 30 రోజుల తర్వాత ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ పొందొచ్చు. ఈఎస్ఐసీ చట్టం, 1948 లోని సెక్షన్ 2(9) ప్రకారం జీవితంలో ఒకసారి మాత్రమే ఈ పథకం ద్వారా బెనిఫిట్ పొందొచ్చు. ఈ లాభాన్ని పొందాలంటే https://www.esic.nic.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోచ్చు.