పోస్ట్ ఆఫీస్ ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. ఈ స్కీమ్స్ వలన కస్టమర్స్ కి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిగా డబ్బులు వస్తాయి. అయితే పోస్ట్ ఆఫీస్ అందించే స్కీమ్స్ లో సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ ఒకటి. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే మంచిగా డబ్బులు వస్తాయి.
ఇక ఈ స్కీమ్ కి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. పోస్టాఫీస్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ వడ్డీని పొందొచ్చు. అయితే ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్‌లో 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఏకంగా 14 లక్షల రూపాయలు వస్తాయి. పైగా పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి రిస్క్ కూడా ఉండదు.
సేవింగ్స్ అకౌంట్ ఉన్నవాళ్లకు, రిటైర్ అయిన సీనియర్ సిటిజన్లకు ఈ స్కీమ్ బాగా హెల్ప్ అవుతుంది. వీళ్ళు మాత్రమే అకౌంట్ చెయ్యడానికి అవుతుంది. ఈ స్కీమ్ లో కనీసం 1,000 రూపాయలతో అకౌంట్ ని ఓపెన్ చెయ్యచ్చు. మీరు కనుక ఈ స్కీమ్ లో మొత్తం 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఐదు సంవత్సరాల తర్వాత 7.4 శాతం వడ్డీతో కలిపి 14,28,964 లక్షలను పొందొచ్చు.
గరిష్టంగా 15 లక్షల రూపాయల వరకు ఇన్వెస్ట్ చేసే అవకాశముంది. ఇది ఇలా ఉంటే మెచ్యూరిటీ పీరియడ్ 5 సంవత్సరాలు. మరో మూడు సంవత్సరాల పాటు ఈ స్కీమ్ ను పొడిగించుకునే అవకాశం వుంది. దగ్గరలో వున్నా పోస్టాఫీస్ బ్రాంచ్ కి వెళ్లి మరిన్ని వివరాలని తెలుసుకుని ఖాతా ఓపెన్ చెయ్యచ్చు.