చాలా మంది ఆవ నూనె ( mustard oil ) ని వంటల్లో ఉపయోగిస్తుంటారు. దీని వల్ల చక్కటి ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. మన ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవడానికి ఆవ నూనె ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఆవ నూనె వల్ల మన శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
మనల్ని మనం సురక్షితంగా ఉంచుకోవడానికి ఆవ నూనెతో చేసిన వంటకాలను తింటే మంచిదని అధ్యయనం ద్వారా తేలింది. ఆవ నూనె తో తయారు చేసిన ఆహారం తీసుకోవడం వల్ల గొంతు, శ్వాసకోస సమస్యలు ఉండవు. అదే విధంగా కఫం, జలుబు, ఛాతినొప్పి, గొంతునొప్పి, దగ్గు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.
బరువు తగ్గించుకోండి:
ఆవ నూనెతో తయారు చేసిన ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు తగ్గుతుంది. అలానే శరీర బరువును కూడా నియంత్రిస్తుంది.
జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది:
ఆవ నూనె పూర్తిగా సహజసిద్ధమైనది. దీనిని శరీరం సులభంగా జీర్ణం చేస్తుంది. ఇలా జీర్ణ వ్యవస్థని కూడా మెరుగుపరచుకోవచ్చు.
మలబద్దకం ఉండదు:
ఫ్రీ మోషన్ అవ్వడానికి ఆవ నూనె బాగా ఉపయోగపడుతుంది. మలబద్ధకం, కడుపు నొప్పితో బాధపడే వాళ్ళు ఆవు నూనె తీసుకుంటే మంచిది.
గుండెకు మంచిది:
గుండెకి కూడా ఆవ నూనె ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి రెగ్యులర్ డైట్ లో ఆవ నూనె తీసుకోండి ఇలా ఎన్నో ప్రయోజనాలు పొంది ఆరోగ్యంగా ఉండొచ్చు.