ఉల్లి వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో మీకు తెలుసా….?

-

ఉల్లిపాయని ప్రతి దాంట్లోనూ వాడుతూ ఉంటాము. వంటల్లో ఉల్లిపాయ లేకపోతే రుచి ఉండదు. దీనిలో శక్తివంతమైన ఆహార విలువలు ఎన్నో ఉన్నాయి. కూరలో వగైరా వంటల్లో ఇది మంచి ఫ్లేవర్ ను ఇస్తుంది. కేవలం రుచికి మాత్రమే కాదు ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అయితే మరి ఉల్లిపాయ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడే తెలుసుకోండి. ఉల్లిపాయ శరీరంలో రక్తం పల్చగా ఉండి కణాలన్నీ ప్రసరించేందుకు ఉపయోగపడుతుంది. అంతే కాదు రక్తం గడ్డ కట్టకుండా రక్త కణాలు నుండి ఎర్ర రక్త కణాల నిరోధిస్తుంది.

దంతక్షయాన్ని మరియు దంతాలలో ఇన్ఫెక్షన్ ను నివారించడానికి ఉల్లిపాయ బాగా ఉపయోగ పడుతుంది. పచ్చి ఉల్లిపాయని కనుక నమిలితే నోటిలో ఉన్న జెర్మ్స్ నశించిపోతాయి. కేవలం ఆరోగ్యానికే కాదు అందానికి కూడా ఉల్లిపాయ బాగా సహాయ పడుతుంది. ఇది ఇలా ఉంటె ఆర్థరైటిస్ నొప్పిని కూడా ఉల్లి తగ్గిస్తుంది. శరీరంలో వేడి ఎక్కువ అయితే ఉల్లిపాయ చలవ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది.

ఎండా కాలంలో ఎక్కువగా వేడి చేసి బాధపడే వారు ఉల్లిపాయ గుజ్జును మీ పాదాలకు మరియు మెడ మీద అప్లై చేయాలి. ఇది ఎంతో వేగంగా మీ శరీరాన్నిచల్లబరుస్తుంది. దీనితో మీకు ఉపశమనం లభిస్తుంది. ఉల్లిపాయ బ్లడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ ను కూడా తగ్గిస్తుంది. ఏమైనా కీటకాలు కుట్టినప్పుడు ఉల్లిపాయ రసాన్ని ఆ ప్రదేశం లో అప్లై చేస్తే నీకు వెంటనే ఉపశమనం లభిస్తుంది. చూశారా ఉల్లి వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయో..! అందుకేనెమో ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని అంటుంటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version