గసగసాలు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే…!

-

సహజంగా గసగసాలని వంటల్లో ఉపయోగిస్తూనే ఉంటాం. వీటి వల్ల చాల ప్రయాజనాలు ఉన్నాయి. మరి అవి ఏమిటో ఇప్పుడే చూసేయండి. శరీరం లో అధిక వేడి ఉంటే చలువ చేయడానికి గసగసాలు బాగా పని చేస్తాయి. దీని కోసం మీరు ముందుగా గసగసాల లో కొన్ని నీళ్లు పోసి మెత్తగా నూరాలి. ఇప్పుడు దానిలో పటిక బెల్లం కూడా కలిపి రోజు తింటుంటే ఉష్ణము తగ్గిపోతుంది. కొన్ని మందులు తయారు చేయడానికి కూడా వీటిని వాడతారు.

అలానే గర్భిణీలకు వచ్చే రక్త జిగట విరేచనాలు కూడా వీటి వల్ల తగ్గుతుంది. అయితే ఎలా ఉపయోగించాలి అనే విషయానికి వస్తే… 10 గ్రాములు గసగసాలు, 20 గ్రాముల పటిక బెల్లం పొడి కలిపి మెత్తగా నూరి స్టోర్ చేసుకోండి. ఈ మిశ్రమాన్ని 5 గ్రాముల మోతాదులో 20 గ్రాములు వెన్న కలుపుకొని రోజుకు రెండు పూటల తింటుంటే రక్త జిగట విరేచనాలు తగ్గిపోతాయి. ఇది ఇలా ఉంటే 10 గ్రాముల గసగసాలను తీసుకుని కొన్ని నీళ్లు పోసి మెత్తగా నూరి అందులోకి అర కప్పు పాలు కలపాలి. ఇందులో 20 గ్రాముల పటిక బెల్లం పొడి కలిపి రోజుకు రెండు పూటలా తాగుతూ ఉంటే వీర్య స్తంభన కలుగుతుంది

గసగసాలను నీళ్ళల్లో నానబెట్టి మెత్తగా రుబ్బి తలకు బాగా పట్టించి ఆరిన తర్వాత కుంకుడు కాయ రసం తో స్నానం చేస్తే తలలో చుండ్రు పోయి వెంట్రుకలు ఆరోగ్యంగా ఎదుగుతాయి. నిద్ర సరిగా రాకపోతే కనుక వేడి చేసిన గసగసాలు ఒక వస్త్రం లో మూటకట్టి వాసన చూస్తూ ఉంటే నిద్ర బాగా పడుతుంది. చూసారా ఎన్ని ప్రయోజనాలో…!

Read more RELATED
Recommended to you

Latest news