చింత గింజల వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా…?

-

చింత పండు నుంచి గింజలు తీసేసి వాటిని పారేస్తూ ఉంటాము. కానీ వాటి వల్ల చాలా మేలు కలుగుతాయి. దీనిని కనుక మీరు పూర్తిగా చూశారంటే… ఆ గింజలు ఎప్పుడు పారేయరు. ఇక దీని వల్ల కలిగే మేలు కోసం చూస్తే… చింత పిక్కల లో క్యాల్షియం, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. చింత గింజలు కనుక తీసుకుంటే కీళ్ల నొప్పుల్ని కూడా తగ్గించ వచ్చు.

వివిధ రకాల వ్యాధుల వల్ల మనకు బ్యాక్టీరియా చేరుతుంది. అది కనుక చేరకుండా ఉండాలి అంటే చింత పిక్కలు సరిగ్గా పని చేస్తాయి. వాటి అంతు చూడడానికి అవే సరైనవి. చింత పిక్కల లో ఉండే టానిన్ చర్మం పై బ్యాక్టీరియాను తొలగిస్తుంది. అలానే వెన్ను నొప్పి ఎక్కువగా ఉంటే చింత పిక్కల పొడిని ఉపయోగించండి. దీనిని తీసుకోవడం వల్ల వెంటనే వెన్ను నొప్పి తగ్గిపోతుంది.

అంతే కాదండి వయస్సు పెరిగిన తర్వాత మహిళలు శరీరం లో క్యాల్షియం తగ్గుతూ ఉంటుంది కనుక వీటిని ఉపయోగిస్తే ఎముకల బలహీనత తగ్గుతుంది. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు దీనిని క్రమం తప్పకుండా ఉపయోగిస్తే కొవ్వు కరిగిపోతుంది. చింత గింజలు వేపుకుని కూడా తినొచ్చు. అలాగే వీటిని పొడి చేసుకుని కూడా ఉపయోగించ వచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news