తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై నటుడు,నిర్మాత, కాంగ్రెస్ నాయకుడు బండ్ల గణేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘దేశంలోని 29 రాష్ట్రాల్లో రేవంత్ రెడ్డి బెస్ట్ ముఖ్యమంత్రి అని కొనియాడారు. రేవంత్ రెడ్డి మిడిల్ క్లాస్ ముఖ్యమంత్రి అని..తాను ముఖ్యమంత్రి అన్న అహంభావం ఉండదు. తను ఎవర్నైనా కలుస్తాడు. తనని ఎవరైనా కలవవొచ్చు’ అని ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
ప్రస్తుతం బండ్ల గణేశ్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాంగ్రెస్ నాయకులు ఆయన్ను సపోర్టు చేస్తుండగా.. బీఆర్ఎస్ నేతలు మాత్రం విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. బండ్ల గణేశ్ గత అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి రేవంత్ రెడ్డికి మద్దతు ప్రకటించడంతో పాటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సైతం పార్టీని సపోర్టు చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు సైతం చేస్తున్నారు.