ప్రాంతీయ పార్టీలే భారతదేశ రాజకీయ భవిష్యత్ : కేటీఆర్

-

మహారాష్ట్ర,జార్ఖండ్ ఎన్నికల ఫలితాలతో ప్రాంతీయ పార్టీలే భారత రాజకీయాల భవిష్యత్తును డిసైడ్ చేస్తాయనే విషయం మరోసారి స్పష్టమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ట్విటర్ ‘ఎక్స్’ వేదికగా కేటీఆర్ స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీ బలమైన ప్రతిపక్షంగా అవతరించడంలో మరోసారి విఫలమైందని, కానీ ప్రాంతీయ పార్టీలను నాశనం చేయడంలో తలమునకలవుతోందన్నారు. ఇది పునరావృతమయ్యే అంశంగా మారిందన్నారు. నేను దాన్ని పునరుద్ఘాటిస్తున్నానని, కాంగ్రెస్ అసమర్థత వల్లనే బీజేపీ మనుగడ సాగిస్తోందన్నారు.

ప్రాంతీయ పార్టీల కృషి, నిబద్ధతపై రెండు జాతీయ పార్టీలు సిగ్గులేకుండా దుమ్మెత్తి పోస్తున్నాయని మండిపడ్డారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డికి ఓ సలహా అని.. మీ ప్రచారాలు, ప్రసంగాలు, బ్యాగులు, చాపర్‌లు మీ పార్టీని ఘోర వైఫల్యం నుండి కాపాడలేకపోయాయని విమర్శించారు.ఇప్పుడు మీరు సీఎంగా మీ ప్రాథమిక కర్తవ్యంపై దృష్టి సారించి, ఏడాది క్రితం తెలంగాణ ప్రజలకు మీరు వాగ్దానం చేసిన ఆరు హామీలను అందించగలరా? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version