ఇప్పుడే మనాలి వెళ్ళాలి..ఈ ప్రదేశాలను మాత్రం మిస్ అవ్వకండి..!

-

చాలా మందికి మంచు కురిసే ప్రదేశాలకు వెళ్లడం అంటే ఇష్టం. చక్కటి అందాల మంచు పర్వతాల మధ్య మనాలి ఉంటుంది. అందుకే చాలా మంది మనాలి వెళ్లడానికి ఇష్ట పడుతుంటారు. శీతాకాలంలో అయితే మనాలి చూడడానికి అద్భుతంగా ఉంటుంది.

 

ఎంతో అందమైన ఈ ప్రదేశాన్ని చూడడానికి ఈ దేశ విదేశాల నుండి కూడా వస్తూ ఉంటారు. అందమైన మంచుతో ఈ ప్రాంతమంతా కూడా కప్పి ఉంటుంది. ఏదో ఇతర దేశాలకు వెళ్లి ఓ టూర్ వేసినట్టు ఉంటుంది మనాలి. పైగా కుటుంబ సభ్యులతో కానీ స్నేహితులతో కలిసి ఈ ప్రదేశానికి వెళ్లి ఎంజాయ్ చేయడానికి కూడా బాగుంటుంది.

పారా గ్లైడింగ్, రివర్ రాఫ్టింగ్ వంటివి కూడా ఇక్కడ చాలా బాగుంటాయి. అయితే మనాలి వెళ్లాలని అనుకునే వారు ఈ ప్రదేశాలను తప్పక చూడాల్సిందే. అయితే మనాలి వెళ్ళినప్పుడు అస్సలు ఈ ప్రదేశాలను మిస్ ఎవ్వడు. మరి తప్పక చూడవలసిన ప్రదేశాల జాబితా చూద్దాం.

మనాలి మాల్ రోడ్:

దీని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. నైట్ టైం తప్పక దీన్ని చూడాలి. టూరిస్ట్లకి అందుబాటులో కెఫెలు, రెస్టారెంట్లు ఉంటాయి. ఇక్కడ షాపింగ్ చేయడానికి చాలా బాగుంటుంది.

రోహ్తాంగ్ పాస్:

ఇది కూడా చాలా అందమైన ప్రదేశం. ఇక్కడకు కూడా తప్పక వెళ్లాల్సిందే సముద్ర మట్టానికి సుమారు 4,000 మీటర్ల ఎత్తు లో ఇది ఉంటుంది. మౌంటెన్ బైకింగ్ వంటివి ఇక్కడ చేయొచ్చు.

హిడింబ టెంపుల్:

హిడింబి టెంపుల్ కూడా అద్భుతంగా ఉంటుంది. చాలా సినిమాలలో హిడింబ
టెంపుల్ ని మనం చూసే ఉంటాం. ఇక్కడికి కూడా తప్పక వెళ్లాల్సిందే.

రాఫ్టింగ్:

బియాస్ నది లో రాఫ్టింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది ఎక్కువమంది రాఫ్టింగ్ ని ఇష్ట పడతారు. కచ్చితంగా మనాలి వెళ్ళినప్పుడు ఇది కూడా చేయండి. ఇలా మనాలి వెళ్ళినప్పుడు ఈ ప్రదేశాలని మిస్ అవకుండా చక్కగా ఎంజాయ్ చేయండి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version