బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్ నుంచి బయటకు వచ్చారు. ఆయన కాన్వాయ్ బయటకు వస్తున్న దృశ్యాలను గుర్తుతెలియని వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసినట్లు తెలుస్తోంది.
అయితే, రెగ్యులర్ చెకప్‌లో భాగంగా కేసీఆర్ హైదరాబాద్ బయలుదేరినట్లు సమాచారం. ముందుగా నందినగర్‌లోని ఆయన ఇంటికి వెళ్లి బస చేశాక.. ఎప్పుడూ వెళ్లే గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో హెల్త్ చెకప్ నిర్వహించుకోనున్నారని తెలుస్తోంది. అయితే,ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సత సభను వరంగల్లో ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు కేసీఆర్ అన్ని జిల్లాల నేతలను పిలిపించుకుని రివ్యూలు నిర్వహిస్తున్నారు.
ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ బయలుదేరిన కేసీఆర్
రెగ్యులర్ హెల్త్ చెకప్ లో భాగంగా ఆసుపత్రికి వెళ్లనున్నట్లు సమాచారం pic.twitter.com/n8TX3Pr3Cl
— BIG TV Breaking News (@bigtvtelugu) April 10, 2025