బెంగళూరు ఐఏఎస్ ఆఫీసర్ బీహెచ్ అనిల్ కుమార్ నిజంగానే ఓ జెంటిల్ మ్యాన్ అనిపించుకున్నారు. తమ ప్రభుత్వ అంబులెన్స్ ఆలస్యం చేయడం మూలానా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అందుకు స్వయానా అనిల్ కుమార్ బాధితుడి ఇంటికి వెళ్ళి క్షమాపణ కోరాడు. ఆయన చేసిన ఈ పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇలాంటి అధికారులు ప్రతీ రాష్ట్రానికి అవసరం అని ఆయనకు ఖితాబు ఇస్తున్నారు.బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తికి ఇటీవలే కరోనా సోకింది. అయితే డాక్టర్ల మేరకు సూదురు వ్యక్తి హోమ్ ఇసోలేషన్ లో ఉంటున్నాడు.
కాగా ఆయనకు సడన్ గా ఊపిరి ఆడలేదు చాలా ఇబ్బంది పడ్డాడు దాంతో బాధితుడి కుటుంబం అంబులెన్స్ కు ఫోన్ చేయగా అంబులెన్స్ రెండు గంటలు ఆలస్యం చేసింది. దాంతో బాధితుడి కుటుంబం ఆయనను ఆటోలో తీసుకెళుతుండగా ఆ వ్యక్తి మరణించాడు. ఈ విషయం బెంగళూరు కార్పొరేషన్ కమిషనర్, ఐఏఎస్ ఆఫీసర్ బీహెచ్ అనిల్ కుమార్ కు తెలియడంతో ఆయన వెంటనే బాధితుడి ఇంటికి వెళ్ళాడు అనంతరం బాధితుడి మరణానికి మేము కారణం అయినందున మమ్మల్ని దయచేసి క్షమించండి అంటూ ఆయన వేడుకున్నాడు. ఆ ఐఏఎస్ ఆఫీసర్ చేసిన ఈ పనికి ఆయన పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.