తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి రామయ్య ఆలయంలో ఈ నెల 10వ తేదీన శ్రీ రామనవమి అంగ రంగ వైభవంగా జరిగింది. శ్రీ సీతారాముల కల్యాణాన్ని చూసేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు చుట్టు పక్కల రాష్ట్రాల భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాగ భద్రాద్రి రామయ్య కల్యాణం తర్వాత.. తలంబ్రాలు తాజా గా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు చేరాయి. స్వామి వారి తీర్థ ప్రసాదాలతో పాటు శ్రీ సీతరాముల కల్యాణ మహోత్సవ తలంబ్రాలను భద్రాద్రి ఆలయ ఈవో శివాజీ తో పాటు అర్చకులు సీఎం కేసీఆర్ కు అందజేశారు.
మంగళ వారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసిన తర్వాత తలంబ్రాలను అందజేశారు. శ్రీ సీతరామలు కల్యాణ మహోత్సవ తలంబ్రాలకు చాలా డిమాండ్ ఉంటుంది. ఈ తలంబ్రాలను భక్తులు ప్రత్యేకంగా ఆర్డర్ చేసుకుంటారు. కాగ భద్రాద్రిలో ఈ నెల 10న జరిగిన రామయ్య కల్యాణం అట్టహాసంగా సాగింది. లక్షలాది మంది భక్తుల మధ్య కల్యాణం జరిగింది. 11వ తేదీన రామయ్య మహా పట్టాభిషేక మహోత్సవం కూడా ఘనంగా జరిగింది.