భగ్గుమన్న భానుడు.. కాలిబూడిదైన పల్సర్ బైక్

-

హైదరాబాద్‌లో ఎండలు భగ్గు మంటున్నాయి. మే నెల రాకముందే భానుడు భగభగ మండుతున్నాడు. దీంతో ఉదయం 10 తర్వాత బయటకు రావాలంటే జనాలు భయపడుతున్నారు. ముఖ్యంగా ముసలివాళ్లు, చిన్నపిల్లలు బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు.

మొన్నటివరకు చల్లగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా వేడేక్కింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా కూకట్ పల్లి – జగద్గిరి గుట్టలో ఎండ తీవ్రతకు పల్సర్ బైక్ కాలి బూడిద అయ్యింది. ఎండలో నడిపిస్తుండగా.. అనుకోకుండా వేడి ఎక్కువై ఇంజిన్ నుంచి మంటలు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో రైడర్ బైక్‌ను పక్కన నిలిపివేసి మంటలను ఆర్పేందుకు యత్నించాడు. స్థానికులు సైతం అతనికి సాయం చేయగా.. మంటలు చల్లారాయి.

Read more RELATED
Recommended to you

Latest news