స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కడియం శ్రీహరి నియోజకవర్గంలోని భూములను కబ్జా చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆరోపించారు. దేవునూరు భూముల అన్యాయంగా కబ్జా చేయాలని కడియం శ్రీహరి చూస్తున్నారని అన్నారు.
తన కూతురు కావ్య, అల్లుడు నజీర్‌తో కలిసి ఈ కుట్రకు పాల్పడుతున్నారని.. ఈ విషయంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. లేనియెడల బీఆర్ఎస్ పక్షాన న్యాయపోరాటం చేస్తామని మాజీ ఉపముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, రాజయ్య ఆరోపణలపై కడియం శ్రీహరి వర్గం నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడం గమనార్హం.