బీఆర్ఎస్ రజతోత్సవ సభకు హమాలీ సంఘం విరాళం ప్రకటించింది. ఈ నెల 27న జరగబోయే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు సంబంధించి ఖర్చుల నిమిత్తం రూ. 1,14,000/- చెక్కును బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు హమాలీ సంఘం అందజేసింది.
ఈ సందర్బంగా కేటీఆర్ వారితో ప్రత్యేకంగా ముచ్చటించారు.వారి బాగోగులు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది.ఇదిలాఉండగా, ఈ నెల 27న బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సుమారు 10 లక్షల మందితో వరంగల్ వేదికగా రజతోత్సవ సభ నిర్వహించాలని మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే.