రెండో షెడ్యూల్ మొదలు పెట్టిన భక్త కన్నప్ప

-

గత కొన్ని సంవత్సరాలుగా హిట్ కోసం ప్రయత్నిస్తున్న మంచు విష్ణుకి సక్సెస్ అందకపోవడంతో ఈసారి ఎలాగైనా మంచి విజయాన్ని అనుకోవాలని భావిస్తున్నాడు.మహా భారతం సీరియల్‌ను తీసిన ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో విష్ణు మంచు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం భక్త కన్నప్ప. మంచు విష్ణు కి ఇది డ్రీమ్ ప్రాజెక్ట్‌. మోహన్ బాబు, ప్రభాస్,మోహన్ లాల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. పాన్ ఇండియా వైడ్‌గా రాబోతోన్న ఈ సినిమాని మోహన్ బాబు నిర్మిస్తున్నారు.ఇది వరకు ఎన్నడూ చూడని ఓ దృశ్యకావ్యంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అంచనాలున్నాయన్న విషయం తెలిసిందే.

ఇండియా,న్యూజిలాండ్‌, థాయ్‌లాండ్ కు చెందిన అత్యంత ప్రతిభావంతులైన ఆర్టిస్టులు, టెక్నిషియన్లతో షూటింగ్ చేస్తున్నారు. న్యూజిలాండ్‌లోని అందమైన ప్రదేశాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే.ఇది వరకే న్యూజిలాండ్‌లో 90 రోజుల పాటు నిర్విరామంగా ఫస్ట్ షెడ్యూల్‌ పూర్తి అయిన తర్వాత చిత్ర బృందం అంతా ఇండియాకు తిరిగి వచ్చింది. అయితే కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్న చిత్ర యూనిట్ మళ్లీ ఇప్పుడు సెకండ్ షెడ్యూల్‌ను ప్రారంభించింది. ఈ మేరకు న్యూజిలాండ్‌లో దిగిన విష్ణు మంచు ఓ వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news