భార్యాభర్తల మధ్య గొడవలు రావడానికి ప్రధాన కారణాలు ఇవే

-

పెళ్లి అంటేనే ఇప్పుడు జనరేషన్‌ వాళ్లకు పెద్ద తలనొప్పిగా మారింది. కొత్త సమస్యలను నెత్తికి వేసుకునే పద్దతినే పెళ్లి అంటారు అని కొత్త నిర్వచనం చెబుతున్నారు. భరించడం, సర్దుకుపోవడం ఈ తరం వారికి అస్సలు తెలియదు.. దీనివల్లే సమస్యలు. తగ్గేదేలే అంటూ..తెగేదాక లాగుతున్నారు.. ఆఖరికి పెళ్లైన సంవత్సరానికే డైవర్స్‌కు అప్లై చేస్తున్నారు. భార్యాభర్తల మధ్య గొడవలు రావడానికి వారికే తెలియని కొన్ని కారణాలు ఉంటాయి.. అవి తప్పు అని వీళ్లకు తెలియదు..కానీ అవి మీ భాగస్వామిని బాధిస్తాయి.. అలాంటి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వైవాహిక జీవితంలో ఇద్దరికీ సమాన భాగస్వామ్యం ముఖ్యం. ఒక వ్యక్తి మాత్రమే ప్రతిదానికీ బాధ్యత వహించి, మరొకరు తన స్వంత పనిని చేస్తే, సంబంధంలో సామరస్యం ఉండదు. అలాంటి సంబంధాలు ఎక్కువ కాలం ఉండవు. కాబట్టి ఇద్దరు బాధ్యతగా ఉండటం నేర్చుకోండి. ఇంటి పని భార్యే చేయాలి. అది వారి బాధ్యత అనే మూస ధోరణిలోంచి బయటకు రండి అబ్బాయిలూ..!

భార్యాభర్తలు ఎప్పుడూ ఒకరి వ్యక్తిత్వంలో లేదా పనిలో తప్పులు దొర్లితే వారి మధ్య సంబంధంలో ప్రేమ ఉండదు. సంబంధం క్షీణిస్తే, చివరికి విడిపోవడమే ఉత్తమ ఎంపిక అని ఇద్దరూ భావిస్తారు. తప్పులు అని మీరు అనుకునేవి మాత్రమే కాదు.. మీ భాగస్వామి అనుకునేవి కూడా మీరు చేయకూడదు.. ఎందుకంటే మీ శరీరాలు వేరైనా మీ ఆత్మలు ఒక్కటే కాబట్టి. ఇలా మేం ఇద్దరం కాదు ఒక్కరమే అనుకుంటే.. ఆ జంట మధ్యలో గొడవలు వచ్చే ఆస్కారమే లేదు.

ఈరోజుల్లో సగం సంబంధాలను కొంపముంచేది ఈ ఫోనే.. మీరు మీ భాగస్వామితో ఉన్నప్పుడు ఫోన్‌ ఎక్కువగా వాడకండి. వారితో మాట్లాడటానికి మీ సమయాన్ని కేటాయించండి. వారు ఏదైనా చెప్తుంటే వినండి. అలా కాకుండా మీరు మీ పార్టనర్‌ను పట్టించుకోకుండా ఫోన్‌ చూస్తుంటే.. చేసేదేం లేక వాళ్లు కూడా ఫోన్ తీసుకుంటారు.. ఇలా దూరం పెరుగుతుంది. ఈ అలవాటు దాంపత్య సంతృప్తిని తగ్గిస్తుంది మరియు రోజువారీ గొడవలకు దారితీస్తుంది.

తమ భాగస్వామి ఆర్థిక వ్యవహారాలను నిర్వహించలేకపోతున్నారని భావించే వ్యక్తులు తమ సంబంధానికి తక్కువ నిబద్ధత కలిగి ఉంటారు. ఈ పరిస్థితి కారణంగా, వారు ఎల్లప్పుడూ అభద్రత భావాన్ని అనుభవిస్తారు. అలాంటి వైవాహిక జీవితంలో రోజువారీ గొడవలు కూడా కొంతకాలం తర్వాత మామూలే. ఆర్థిక సమస్యలు ఎవరి జీవితంలో అయినా సాధారణమే. .కానీ వాటిని ఎలా పరిష్కరించుకుంటున్నారో మీరే ఆలోచించుకోవాలి. అనవసరపు ఖర్చులను తగ్గించుకోండి..పొదుపు చేయడం గురించి ఇద్దరు కలిసి మాట్లాడుకోండి.

తమ భాగస్వామి కోసం వారు చేసిన వాటిని ఎల్లప్పుడూ ట్రాక్ చేసే మరియు వారి భాగస్వామి యొక్క తప్పులను హైలైట్ చేసే జంటలు వారి సంబంధంలో సంతోషంగా ఉండరు. ఇలాంటి లెక్కలు వైవాహిక జీవితంలో చీలికకు దారితీస్తాయి. మరియు సంబంధాన్ని దెబ్బతీస్తాయి.

ఈ తరం వాళ్లు గ్రహించలేని విషయం ఏంటో తెలుసా.. పెళ్లి చేసుకున్న వారి మీద అసలైన ప్రేమ..పెళ్లైన 25 ఏళ్ల తర్వాత మొదలవుతుంది..అది ట్రూ లవ్‌ అంటే.. కానీ అప్పటి వరకూ ఆగకుండా పెళ్లైనే నెలకు, సంవత్సరానికే..వీళ్లు నాకు కరెక్టు కాదని.. విడాకులు తీసుకుంటున్నారు..కానీ కొన్నేళ్ల తర్వాత మీరే అనుకుంటారు.. మంచి వ్యక్తిని దూరం చేసుకున్నాను అని.. ! పెళ్లి చేసుకోవడానికి ఎన్నిసార్లు ఆలోచించారో.. విడిపోవడానికి కూడా అంతకుమించి ఆలోచించాలి..చిన్న కష్టానికే వద్దు అని అనుకోకండి. అలా అని బానిసల్లా బతకాల్సిన అవసరం లేదు. సమస్యను ఏ మార్గంలో పరిష్కరించాలో తెలుసుకోవాలి. విడిపోవడం అనేది పరిష్కారం కాదు..! ఏమంటారు..!!

Read more RELATED
Recommended to you

Latest news