నాగపూర్ లో భానుడి భగ భగ.. రికార్డు స్థాయిలో 56 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

-

దేశవ్యాప్తంగా ఎండలు భగ భగ మండుతున్నాయి. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. మొన్నటికి మొన్న దేశ రాజధాని ఢిల్లీలో అత్యధికంగా 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన విషయం తెలిసిందే. ఆ ఉష్ణోగ్రతను దాటి ఇప్పుడు మహారాష్ట్రలోని నాగపూర్ లో ఏకంగా 56 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.  భారత వాతావరణ విభాగం నాలుగు ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ ను
ఏర్పాటుచేసింది. ఇందులో రెండింటిలో కూడా అసాధారణ ఉష్ణోగ్రతలు చూపించాయి.

సోనేగావ్లోని ఏడబ్ల్యూ వేస్ స్టేషన్లో 54 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా.. ఉత్తర అంబాజరీ రోడ్డులోని ఐఎండీ కేంద్రంలో రికార్డు స్థాయిలో 56 డిగ్రీలు నమోదైంది. మిగతా రెండు స్టేషన్లలో 44 డిగ్రీల ఎండలు ఉన్నట్లు రికార్డయ్యింది. ఇటీవల ఢిల్లీ లోని ముంగేషుర్లో 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన సంగతి
తెలిసిందే. ఢిల్లీ చరిత్రలో ఇదే అత్యధికం కావడంతో వాతావరణ శాఖ స్పందిందించి.. ఆ వాతావరణ స్టేషన్ లోని సెన్సార్ సరిగా పనిచేస్తుందో, లేదో తనిఖీ చేస్తున్నట్లు తెలిపింది. ఈ పరిణామాల వేళ ఇప్పుడు నాగపూర్ లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవడం మరోసారి చర్చకు దారితీసింది. ఇక్కడా సెన్సార్ పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిపై అధికారులు స్పందించాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news