ఫైజర్ మరియు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తరువాత, భారత్ బయోటెక్ తన కరోనా వైరస్ వ్యాక్సిన్ కోవాక్సిన్ కోసం అత్యవసర వినియోగ అనుమతి కోసం దరఖాస్తు చేసింది. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ఈ సంస్థ అత్యవసర వినియోగ అధికారాన్ని కోరుతూ సెంట్రల్ డ్రగ్ రెగ్యులేటర్ కు లేఖ రాసింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) సహకారంతో ఈ టీకాను భారత్ బయోటెక్ అభివృద్ధి చేసింది.
సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మరియు భారత్ బయోటెక్ రెండూ ప్రస్తుతం భారతదేశంలో మూడో దశ క్లీనికల్ ట్రయల్స్ ని నిర్వహిస్తున్నాయి. కోవాక్సిన్ ట్రయల్ వాలంటీర్ అయిన హర్యానా ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ కరోనా బారిన పడటం సంచలనం అయింది. 67 ఏళ్ల మంత్రికి నవంబర్ 20 న మొదటి షాట్ ఇచ్చారు. డిసెంబర్ 4 న అఖిలపక్ష సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ కొన్ని వారాల్లో కోవిడ్ -19 వ్యాక్సిన్ సిద్ధంగా ఉండవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.