బ్రేకింగ్ : కోవాగ్జిన్‌ టీకాకు WHO ఆమోదం..

కరోనా కట్టడి కోసం హైదరాబాద్‌ కు చెందిన భారత్‌ బయోటెక్‌ సంస్థ అభివృద్ది చేసిన కోవాగ్జిన్‌ కు వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ ( WHO )గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇప్పటి వరకు కోవాగ్జిన్‌ వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారికంగా ఆమోదం తెలపని సంగతి  తెలిసిందే.

అయితే… తాజాగా WHO… కోవాగ్జిన్‌ టీకాకు ఆమోదం తెలిపింది. ఈ రోజు సమావేశమైన WHO యొక్క టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్, భారత్ బయోటెక్ యొక్క కోవాక్సిన్ కోసం అత్యవసర వినియోగ జాబితా స్థితిని సిఫార్సు చేసింది. దీంతో కోవాగ్జిన్‌ టీకా అత్యవసర వినియోగానికి అనుమతి లభించింది. 18 సంవత్సరాలు పై బడిన వారికి కోవాగ్జిన్‌ టీకా ఇవ్వచ్చని స్పష్టం చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. దీంతో కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి భారీ ఊరట లభించింది.