నర్సింగ్ విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ప్రభుత్వ ఆసుపత్రి లో చదువుతున్న జీఎన్ఎమ్ లు, బిఎస్ సి నర్సింగ్ విద్యార్థులు, ఎమ్ ఎస్ .సి నర్సింగ్ విద్యార్ధుల కు స్టై ఫండ్ ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది కేసీఆర్ ప్రభుత్వం. నిమ్స్ ఆసుపత్రి లో చదువుతున్న నర్సింగ్ విద్యార్ధులకు కూడా స్టై ఫండ్ ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పెంచిన వివరాలు ఇలా ఉన్నాయి.
GNM NURSING
1st year – 1500 నుంచి 5000 కు పెంపు
2nd year -1700 నుంచి 6000కు పెంపు
3rd year -1900 నుంచి 7000 కు పెంపు
B.sc nursing
1st year – 1500 నుంచి 5000 కు పెంపు
2nd year –1700 నుంచి 6000 కు పెంపు
3rd year– 1900 నుంచి 7000 కు పెంపు
4th year–2,200 నుంచి 8000 కు పెంపు
MSC NURSING
1st year –9000
2nd year –10000