నిరుద్యోగులకు బెల్‌ శుభవార్త.. వివరాలు ఇవే!

-

భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌ తెలిపింది. తాజాగా మరో జాబ్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. వివిధ విభాగాల్లో నియామకాలు చేపట్టనున్నారు. ఎంపికైన అభ్యర్థులు కాంట్రాక్ట్‌ విధానంలో పని చేయాల్సి ఉంటుంది. పోస్టుల ఆధారంగా రూ. 25 – 50 వేల వరకు వేతనం చెల్లించనున్నట్లు నోటిఫికేషన్‌లో తెలిపారు.

bell

ఖాళీల వివరాలు..

మొత్తం ఖాళీలు 14
ట్రైనీ ఇంజినీర్‌– 10
ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌– 4

ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్, టెలీకమ్యూనికేషన్, , కమ్యూనికేషన్‌ అండ్‌ కంప్యూటర్‌ సై¯Œ ్స ఇంజినీరింగ్‌ సబ్జెక్టుల్లో బీఈ లేదా బీటెక్‌ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
ఇతర వివరాలను అభ్యర్థులు నోటిఫికేషన్లో చూడొచ్చు.

దరఖాస్తు చేసుకునే విధానం..

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్‌ 8 చివరి తేదీగా నిర్ణయించారు. ప్రాజక్ట్‌ ఇంజినీర్‌ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు రూ. 500 పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ట్రైనీ ఇంజినీర్‌ ఉద్యోగాలకు రూ. 200 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జీతభత్యాల గురించిన వివరాలు నోటిఫికేషన్‌లో స్పష్టంగా సూచించారు. దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు క్షుణ్నంగా నోటిఫికేషన్‌ చదవాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version