ఆలు లేదు సూలులేదు కొడుకు పేరు సోమలింగం అన్నాడంట వెనుకటికి ఎవరో..ఇప్పుడు అలాగే ఉంది రాజమండ్రిలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య పోరు..అసలు టికెట్ ఫిక్స్ అవ్వలేదు గాని, అప్పుడే తేల్చేసుకుందామని, రాజమండ్రి ఎంపీ భరత్..టీడీపీ నేత ఆదిరెడ్డి శ్రీనివాస్ లు సవాళ్లు విసురుకుంటున్నారు. అసలు ఇంతవరకు ఇక్కడ టికెట్ ఎవరికీ ఫిక్స్ కాలేదు…అటు వైసీపీ గాని, ఇటు టీడీపీ గాని రాజమండ్రి సిటీ సీటు ఫిక్స్ చేయలేదు. ప్రస్తుతం ఈ సీటు టీడీపీ చేతుల్లో ఉంది…ఎమ్మెల్యేగా శ్రీనివాస్ భార్య ఆదిరెడ్డి భవాని ఎమ్మెల్యేగా ఉన్నారు. గత ఎన్నికల్లో జగన్ గాలిలో సైతం రాజమండ్రి సిటీలో భవాని టీడీపీ నుంచి దాదాపు ౩౦ వేలఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు.
అయితే వచ్చే ఎన్నికల్లో భవాని పోటీ చేయనని చెప్పేసారు..తన భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్ పోటీ చేస్తారని చెప్పారు. దీంతో వాసు దూకుడుగా పనిచేయడం మొదలుపెట్టారు. అసలు ఎమ్మెల్యే భవాని అయినా సరే వాసునే రాజమండ్రిలో పనులు చేస్తున్నారు…ఆయనే పార్టీలో దూకుడుగా ఉంటూ…సిటీలో పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని చెబుతున్నారు.
ఇదే సమయంలో ఆదిరెడ్డి వాసుపై ఎంపీ భరత్ విమర్శలు చేసారు…నెక్స్ట్ ఆదిరెడ్డి ఫ్యామిలీకి చెక్ పెడతానన్నట్లు భరత్ చెబుతున్నారు. అలాగే తానే స్వయంగా బరిలో దిగుతానని అనుచరులతో అంటున్నారు. అయితే ఈ సీటు కోసం చాలామంది వైసీపీ నేతలు పోటీ పడుతున్నారు. వారిని దాటుకుని భరత్ సీటు సాధిస్తారనేది చెప్పలేం, అటు వాసుకు సైతం టీడీపీ టికెట్ ఫిక్స్ చేయలేదు. ఈ సీటుపై రాజమండ్రి రూరల్ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరీ కన్నేశారు. మరి చంద్రబాబు ఇద్దరిలో ఎవరికి సీటు ఇస్తారో చెప్పలేం. అంటే టోటల్ గా వైసీపీలో గాని ఇటు టీడీపీలో గాని సీటు ఫిక్స్ కాలేదు, కానీ ఈ లోపే వాసు-భరత్ ల మధ్య వార్ జరుగుతుంది. మరి రాజమండ్రిలో ఈ రచ్చ ఎంతవరకు వెళుతుందో చూడాలి.