అల్లు అర్జున్ 10 లక్షలు మాత్రమే ఇచ్చారు: రేవతి భర్త

-

సంధ్య థియేటర్ తొక్కిసలాటలో మరణించిన రేవతి భర్త భాస్కర్ కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం శ్రీ తేజ నిన్నమొన్నటి నుంచి కొంచం బెటర్ గా ఉన్నాడు. 48 గంటలు అయ్యింది వెంటిలేటర్ తీసేశారు. గత కొన్ని రోజులుగా చాలా దారుణంగా ఉంది అతని హెల్త్ కండిషన్. రెండ్రోజులుగా కదలికలు ఉన్నాయి. పుష్ప ప్రొడ్యూసర్ 50 లక్షలు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి 25 లక్షలు.. అల్లు అర్జున్ 10 లక్షలు ఇచ్చారు అని ఆయన అన్నారు.

ఇక సెకండ్ డే నుంచి మాకు సినిమా ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ ఇచ్చారు. అల్లు అర్జున్ సైడ్ నుంచి సపోర్ట్ ఉంది. అందుకే కేసు వాపసు తీసుకుంటాను అని చెప్పినాను. నన్ను ఎవ్వరూ ఫోర్స్ చెయ్యలేదు. మా వైఫ్ నాకన్నా ముందు లోపలికి వెళ్ళిపోయింది. లోపల ఏమైంది అని నాకు తెలియదు. పాప ను వదిలేసి వాచ్చే లోపు ఇదంతా జరిగింది. మా ట్రీట్మెంట్ మేము చేస్తాం అని హాస్పిటల్ వాళ్ళు చెప్పారు.. కానీ ఇప్పటివరకు శ్రీ తేజకు స్పృహ రాలేదు అని భాస్కర్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version