తెలంగాణ బడ్జెట్ పై కాంగ్రెస్ ఎమ్యెల్యే భట్టి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర అప్పు 4.86 వేల కోట్లకు చేరిందని మండిపడ్డారు. ఈ అప్పులు ఎవరు కట్టాలి ..సామాన్యుల మీదనే కదా భారం వేసేదన్నారు కాంగ్రెస్ ఎమ్యెల్యే భట్టి. తలసరి ఆదాయం పెరిగింది అని లెక్కలు చెప్తున్నారూ.. ఎలా పెరిగాయి చెప్పండని నిలదీశారు. ఆదాయం పెరిగింది కొందరికెనని వెల్లడించారు.
భారీ బడ్జెట్ .. అంచనాలు సరిగా లేవు.. ట్యాక్స్ రెవెన్యూ 40 వేళా కోట్లు చూపెట్టారని మండిపడ్డారు. ట్యాక్స్ వేశారా… వేయాలని ఆలోచిస్తున్నారా..? 41 వేల కోట్లు గ్రాంట్స్ అంచనా వేసుకుంటున్నారని అగ్రహించారు. తెలంగాణ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు 8 వేల కోట్లు దాటలేదన్నారు. భారీ బడ్జెట్ అంచనాలు సరిగా లేవు.. ట్యాక్స్ రెవెన్యూ రూ.40 వేల కోట్లు చూపెట్టారు.. ట్యాక్స్ వేశారా, వేయాలని ఆలోచిస్తున్నారా?.. 41 వేల కోట్లు గ్రాంట్స్ అంచనా వేసుకుంటున్నారు.. తలసరి ఆదాయం ఎలా పెరిగిందో లెక్కలు చెప్పాలి.. రూ.4.86 వేల కోట్ల అప్పు చేశారు.. ఈ అప్పులు ఎవరు కట్టాలి?.. సామాన్యుల మీదనే కదా భారం వేసేదన్నారు భట్టి విక్రమార్క.