వివేకా కేసులో జగన్ జైలుకు పోతారు ? ఆంధ్రాకు వెళ్లిపో షర్మిల – కడియం శ్రీహరి

-

వివేకా కేసులో జగన్ జైలుకు పోతారు ? ఆంధ్రాకు వెళ్లిపో షర్మిల అంటూ వైయస్ షర్మిలపై కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు. జగన్ సీఎం కావడంలో షర్మిల, విజయమ్మ పాత్ర కీలకం వహించారని, షర్మిల నీకు జరిగిన అన్యాయాన్ని ఏపీలో ప్రచారం చేసుకో అన్నారు. షర్మిల తెలంగాణలో పాదయాత్ర చేసుకుంటూ ఆమె శక్తిని సమయాన్ని,వనరులను వృధా చేసుకుంటుంది.. వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం మొదటి నుండి తెలంగాణకు వ్యతిరేకమన్నారు.


వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అడుగడుగునా తెలంగాణ ఏర్పాటును అడ్డుకున్న వ్యక్తి అని.. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పాసైన రోజున వైయస్ జగన్మోహన్ రెడ్డి సమైక్యాంధ్ర ప్లకార్ట్స్ లను పట్టుకొని స్పీకర్ ముందు నిలబడ్డాడని మండిపడ్డారు. సమైక్యాంధ్రనే మా నినాదం అని చెప్పి ఊరువాడ తిరిగిన వ్యక్తి షర్మిల అని.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడి,తిరిగి తెలంగాణలోనే రాజకీయాలు చేస్తామంటే చూస్తూ ఉండడానికి తెలంగాణ ప్రజలు అమాయకులు కాదన్నారు.

వైయస్ జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసులో ఇరుక్కొని జైలుకు వెళ్లిన తర్వాత వైయస్ షర్మిల,విజయమ్మ పాదయాత్రలు చేశారు.. వైయస్ జగన్మోహన్ రెడ్డి షర్మిలకు,విజయమ్మకు అన్యాయం చేసి వీరిని రాజకీయంగా పక్కకు పెట్టారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతుంది , నీకు ఎమైనా రాజకీయ పరిజ్ఞానం ఉంటే ఆంధ్రాకి వెళ్ళు అన్నారు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి.

Read more RELATED
Recommended to you

Exit mobile version