BheemlaNayak : భీమ్లా నాయక్ నుంచి బిగ్ అప్డేట్… జనవరి 12న రిలీజ్

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రలుగా భీమ్లా నాయక్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సాగర్ కే చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా… పవర్స్టార్ పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నిత్యామీనన్ నటిస్తోంది. అలాగే కిరణ్ రానా సరసన సంయుక్త మీనన్ నటిస్తోంది.

మలయాళంలో హిట్ కొట్టిన అయ్యప్పనుమ్ కోషీయం సినిమాకు ఇది రీమేక్. ఇక భీమ్లా నాయక్ సినిమా నుంచి వచ్చిన.. పోస్టర్లు, టీచర్లు మరియు పాటలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నుంచి మరో అదిరిపోయే అప్డేట్ వదిలింది చిత్రబృందం. ఈ సినిమా సంగీత దర్శకుడు ఎస్.ఎస్ తమన్ బర్త్ డే నేపథ్యంలో ఈ అప్డేట్ను ఇచ్చింది చిత్రబృందం. భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ డేట్ ఖరారు చేసింది చిత్రబృందం. జనవరి 12 అంటే సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల కానుంది చిత్ర బృందం.

Read more RELATED
Recommended to you

Latest news