భోగి పండుగ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పవిత్రమైన ఈ భోగి పండుగ మీకు, మీ కుటుంబానికి కొత్త వెలుగులు తేవాలని, పాత బాధలు పోయి సానుకూల దృక్పథంతో జీవితంలో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు తెలిపారు.
ఇదిలాఉండగా, తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించడంతో హైదరాబాద్‌ను వీడి ప్రజలంతా సొంతూర్లకు వెళ్లారు. దీంతో నగరంలోని రోడ్లు మొత్తం బోసిపోయాయి. ప్రధాన వీధులు, కూడళ్లు మొత్తం ఖాళీగా దర్శనమిస్తున్నాయి.