BholaaShankar : బోళా శంకర్ సినిమా ముహుర్తం ఫిక్స్.. ఫోటోలు వైరల్

-

ఇటీవలే ఆచార్య సినిమా పూర్తి చేసుకున్న మెగాస్టార్‌ చిరంజీవి వరుస సినిమాలతో దూసుకు పోతున్నాడు. ఇక ఇటీవలే మెగాస్టార్‌ చిరంజీవి 154 వ సినిమాను కూడా అధికారికంగా ప్రకటించారు. మోహర్‌ రమేష్‌ దర్శకత్వంలో ఈ సినిమా ను చేస్తున్నాడు మెగాస్టార్‌. అయితే.. ఈ సినిమా కు బోళా శంకర్‌ అనే టైటిల్‌ ను ఫిక్స్‌ చేసింది చిత్ర బృందం. వేదాళం సినిమా కు రీమేక్‌ గా బోళా శంకర్‌ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమా ఏకే ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ పతాకం పై తెరకెక్కతోంది.

అలాగే.. ఈ సినిమా అనిల్‌ సుంకర్‌ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కిర్తీ సురేష్‌ కూడా ఓ స్పెషల్‌ రోల్‌ చేస్తుండగా…తమన్నా హీరోయిన్‌ గా చేస్తున్నారు. అయితే.. ఈ సినిమా నుంచి తాజాగా ఓ బిగ్‌ అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించింది చిత్ర బృందం. ఈ పూజా కార్యక్రమాన్ని ఇవాళ ఉదయం 7.45 గంటలకు ప్రారంభించారు. ఇక కార్యక్రమంలో చిత్ర బృందం సభ్యులతో పాటు చిరంజీవి, తమన్నా కు హాజరయ్యారు. ఇక ఈ పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news