క్రాక్ సాంగ్.. ముద్దుల సౌండుతో భూమి బద్దలు..

మాస్ మహారాజా రవితేజ క్రాక్ సినిమా షూటింగులో చాలా బిజీగా ఉన్నాడు. ఐతే అటు షూటింగ్ జరుగుతుండగానే ప్రమోషన్ల పనిలో పడింది. క్రాక్ సినిమా నుండి మొదటి సాంగ్ రిలీజైంది. భూమి బద్దలు అనే పేరుతో మాంచి మాస్ ఐటెమ్ సాంగ్ రిలీజ్ చేసారు. ఈ పాటలో వర్మ హీరోయిన్ అప్సరా రాణి, రవితేజతో స్టెప్పులేసింది. ఈ సంవత్సరం అత్యుత్తమ మాస్ పాట ఇదే అని చెప్పిన చిత్రబృందం నిజంగా అద్భుతమైన మాస్ పాటని అందించింది.

నిజంగా భూమి బద్దలయేట్టుగా వినిపిస్తున్న ఈ టకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటని మంగ్లీ, సింహా కలిసి మరో లెవెల్లో పాడారు. థమన్ నుండి అద్భుతమైన మాస్ సాంగ్ భూమి బద్దలు రూపంలో వచ్చింది. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు.