Bhumika : నాలుగు పదుల వయసులోనూ ఖుషీ ఖుషీగా భూమిక

-

భూమికా చావ్లా.. ఒకప్పుడు ప్రతి తెలుగు కుర్రాడి కలల రాణి. ఖుషీ సినిమాతో ఈ భామ కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్​గా మారిపోయింది. దాదాపు ఓ దశాబ్ధమంతా తెలుగు సినిమా తెరను భూమిక ఏలిందని చెప్పొచ్చు. నాగార్జున, వెంకటేశ్ వంటి సీనియర్ హీరోలతో నటిస్తూనే.. మహేశ్ బాబు, ఎన్టీఆర్ వంటి యంగ్ హీరోలతో జతకట్టింది.

యువకుడు సినిమాతో టాలీవుడ్​లో ఎంట్రీ ఇచ్చిన భూమిక.. ఖుషి, ఒక్కడు, సింహాద్రి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. ఈ మూవీస్​తో తెలుగు సినిమా ఇండస్ట్రీలో భూమిక పేరు మార్మోగింది. ఇక తెలుగు కుర్రాళ్ల మదిలో ఈ బ్యూటీ తన స్థానాన్ని పదిలం చేసుకుంది. అయితే కెరీర్ పీక్​లో ఉన్నప్పుడే ఈ భామ 2007లో భరత్ ఠాకూర్​ను పెళ్లాడింది. ఇక ఆ తర్వాత సినిమాలకు దూరమైంది.

కొన్నేళ్లు సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న భూమి రీసెంట్​గా సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేసింది. ఎంసీఏలో నాని వదినగా.. సీటీమార్​లో గోపీచంద్​కు అక్కగా.. సవ్యసాచిలో నాగ చైతన్యకు అక్కగా నటించింది. నాలుగు పదుల వయసు దాటినా ఈ భామ అందం ఇంకా చెక్కుచెదరలేదు.

పాలరాతి లాంటి సొగసుతో భూమిక కుర్రాళ్లను ఇంకా కవ్విస్తోంది. తాజాగా భూమిక గ్రీన్ కలర్ ఫ్రాక్​లో ఫొటోషూట్ చేసింది. ఈ ఫొటోలు చూసిన కుర్రాళ్లు.. భూమిక అప్పుడు.. ఇప్పుడు ఒకేలా ఉంది. ఏం మారలేదు.. సో క్యూట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version