సినిమా పరిశ్రమలో హీరోయిన్ లకు ఎక్కువగా ఎదురయ్యే ప్రశ్నలు కమిట్మెంట్ గురించే ఉంటాయి. ఏ ఇంటర్యూకు వెళ్లినా కమిట్మెంట్ పై ప్రశ్నలు వేస్తుంటారు. అయితే అలాంటి ప్రశ్నలే ఇప్పుడు భూమికకు కూడా ఎదురయ్యాయి. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన భూమిక ప్రస్తుతం అక్క వదిన పాత్రల్లోనూ నటిస్తూ అలరిస్తున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా భూమిక ఓ టీవీ ఇంటర్య్వూలో ఆసక్తికర కామెంట్లు చేసింది. కాస్టింగ్ కౌచ్ గురించి భూమికను ప్రశ్నించగా కమిట్మెంట్ ఇస్తేనే ఆఫర్లు వస్తాయని… నిర్మాతలతో టచ్ లో ఉంటేనే ఆఫర్లు వస్తాయనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని వ్యాఖ్యానించింది.
ఎన్నో ఏళ్ల నుండి తాను ఇండస్ట్రీలో ఉన్నానని….తనను ఎప్పుడూ ఎవరూ కమిట్మెంట్ అడగలేదని భూమిక చెప్పుకొచ్చింది. తాను ఓ పాత్రకు సరిపోతానని దర్శకులు అనుకుంటే ముంబైకి వచ్చి తనను సంప్రదించేవారని కథ నచ్చితే సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేదానినని భూమిక వెల్లడించింది. ఇదిలా ఉండగా సినిమా హీరోయిన్ లు చాలా మంది క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన విషయాలు బయటపెడుతుంటారు. కానీ భూమిక మాత్రం అందుకు విరుద్దంగా మాట్లాడుతోంది.